జూబ్లీహిల్స్: కోవిడ్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయినా మనోస్థైర్యం కోల్పోకుండా శ్రీనగర్‌కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు విక్రయిస్తూ ‘ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ’కు ప్రతీకగా నిలుస్తున్న శారద దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి ఆమె దుకాణం మూసివేసి మిగిలిన కూరగాలను అక్కడే బండిపై ఉంచి కవర్‌తో కప్పి యధావిధిగా ఇంటికి వెళ్లిపోయారు . (శారదకు జాబ్ లెటర్: సోనూసూద్)
ఉదయం వచ్చి చూసేసరికి మొత్తం కూరగాయలు మాయయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.5 వేల విలువైన కూరగాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపింది. తన తండ్రి హయాం నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై పెట్టి ప్యాక్ చేసి ఇంటికి వెళతామని, ఇప్పటివరకు ఎప్పుడూ దొంగతనం జరగలేదని ఆమె పేర్కొన్నారు. (జీవితం పచ్చగా ఉంది)
Comments
Please login to add a commentAdd a comment