జగనన్నతోనే బీసీలకు సముచిత స్థానం | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే బీసీలకు సముచిత స్థానం

Published Tue, May 7 2024 10:10 AM

జగనన్

గూడూరురూరల్‌ : జగనన్నతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ఈనెల 13న జరిగే ఎన్నికల్లో బీసీలందరూ వైఎస్సార్‌సీపీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని మరలా సీఎంగా ఆశీర్వదించాలని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సాయినగర్‌లో ఏర్పాటైన పీవీఆర్‌ కల్యాణ మండపంలో సోమవారం జయహో బీసీల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా సాగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు న్యాయం జరగలేదని, కేవలం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే బీసీలను గుర్తించి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్‌ను, తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు మాట్లాడుతూ ప్రతిపక్షాలు విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయని, వారు చెప్పే మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దని హితవు పలికారు. బడుగు, బలహీనవర్గాలను అక్కున చేర్చుకున్న జగనన్నకు ఇంకో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొనకా దేవసేనమ్మ, పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జేసీఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చేవూరు విజయమోహన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, దేవరాల సుబ్రమణ్యం, తాళ్లూరు శ్రీనివాసులు, బాలిబోయిన రమేష్‌, మండ్ల సురేష్‌బాబు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు రాజారెడ్డి, రాజేష్‌కుమార్‌, మొబీన్‌బాషా, ప్రసాద్‌గౌడ్‌, గురుస్వామి, రాజేష్‌ యాదవ్‌, కటికాల శేషగిరి, రమేష్‌ యాదవ్‌, కోదండరామయ్య, షంషీర్‌, సాయి పాల్గొన్నారు.

జగనన్నతోనే బీసీలకు సముచిత స్థానం
1/1

జగనన్నతోనే బీసీలకు సముచిత స్థానం

 
Advertisement
 
Advertisement