
పూడు పాముల ముఠాకు జైలు
సత్యవేడు: పూడు పాముల అక్రమ రవాణ కేసులో ముగ్గురు నిందిలు ఒక్కొక్కరికీ ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సత్యవేడు జ్యూడీషియల్ కోర్టు ఇన్‌చార్జ్ న్యాయమూర్తి గోపాలకృష్ణ తీర్పు వెల్లడించినట్టు స్థానిక అటవీ శాఖ రేంజర్ త్రీనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జైలు శిక్ష పడ్డ వారిలో పేరడం యానాది కాలనీకి చెందిన మేకల లక్ష్మయ్య, తమిళనాడు ఊత్తుకోటై అంబేడ్కర్ కాలనీకి చెందిన రాధ ఉన్నారు. కాగా కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 2009 జూలై 22వ తేదీన అటవీ ప్రాంతంలో నాలుగ పూడు పాములు పట్టుకొని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అప్పటి ఎస్‌ఐ బీవీ.శ్రీనివాసులు వారిని పట్టుకుని, పూడు పాములతో సహా అటవీ శాఖకు అప్పగించారు. ఈ నేపథ్యంలో అప్పటి అటవీశాఖ అధికారి జయప్రసాద్‌రావు దీనిపై కేసు నమోదు చేసి అటవీ సెక్షన్ ప్రకారం కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం ఎఫ్‌పీఓగా పనిచేస్తున్న వేణుగోపాల్ ఇందుకు సంబంధించిన సాక్షులను ప్రవేశపెట్టారు. పీపీ లత వాదించారు. నేరం నిరూపతమవడంతో ముద్దాయిలకు జైలు శిక్ష విధించారు.
ఎన్‌ఈఈఆర్‌ఐ డైరెక్టర్‌గా ఎస్వీయూ పూర్వ విద్యార్థి
తిరుపతి సిటీ: ఎస్వీయూ కాలే జ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్వీ మోహన్ నాగపూర్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎస్వీయూలో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చీఫ్ సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్‌ఈఈఆర్‌ఐ డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా ఏబీఆర్‌ఎస్‌ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎస్వీయూ ప్రొఫెసర్ డాక్టర్ వైవీ.రామిరెడ్డి గురువారం ఆయనను హైదరాబాద్‌లోని ఐఐసీటీలో కలసి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డీ.శ్రీనివాసరెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కిరణ్, డాక్టర్ సౌజన్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment