తిరుపతి అర్బన్: ‘ఓ వైపు ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మరోవైపు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధపెట్టాలి’ అని డీపీటీవో నరసింహులు డీఎంలకు సూచించారు. అలిపిరి డిపోలో సోమవారం జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల మేనేజర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఆదాయంలో గత ఆరేళ్లుగా ముందు వరుసలో ఉంటున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ఈ ఏడాది నంబర్ వన్ స్థానంలో ఉండాలంటే అంతా కష్టపడి పనిచేయాలని చెప్పారు. అంతేతప్ప కార్యాలయానికి పరిమితమైతే కుదరదని స్పష్టం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విద్యుత్ బస్సుల నిర్వహణపై అవగాహన
భవిష్యత్‌తో అన్ని డిపోలకు విద్యుత్ సర్వీసులు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ప్రతి డీఎంకి వాటి నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్‌కి చెందిన వీఎస్‌ఆర్ అండ్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఓ ఇంజినీరింగ్ బృందం డీఎంలకు విద్యుత్ సర్వీసులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీటీఎం విశ్వనాథం, డీఎంలు హరిబాబు, బాలాజీ, భాస్కర్‌రావు, మునిచంద్ర, పుష్పలత, ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment