
శ్రీనివాసా.. మళ్లీ దొంగాట!
సాక్షి టాస్క్‌ఫోర్స్: సైదాపురానికి కూత వేటు దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ముఖ్యనేత కనుసన్నల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. సరిగ్గా నాలుగు నెలలు క్రితమే స్థానిక ప్రజాప్రతినిధికి ఆ ముఖ్యనేత మధ్య చెలరేగిన వివాదం కారణంగా ఆ మైన్‌పై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కూటమి నేతల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ ఆ శ్రీనివాసా పద్మావతి గనిలో మళ్లీ అక్రమ మైనింగ్ మొదలైంది.
మళ్లీ మొదలైన అక్రమ మైనింగ్
మండల కేంద్రమైన సైదాపురానికి కూత వేటు దూరంలోనే కాలం చెల్లిన శ్రీనివాసా పద్మావతి గని ఉంది. గతంలో లీజు కాలవ్యవధి తీరిపోవడంతో గనిని అలాగే వదిలేశారు. ఈ గనిలో మైకా క్వార్ట్జ్జ్ ఖనిజం లభ్యమవుతోంది. దీనికి డిమాండ్ ఉండడంతో నేతల కన్ను ఈ గనిపై పడింది. గత ఏడాది అక్టోబర్‌లో ఆ గనిలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు అధికారులచేత తనిఖీలు చేయించి అందులో పనిచేస్తున్న విలువైన యంత్రాలను సీజ్ చేయించారు. కాని ఏమైందో ఏమో కాని శనివారం నుంచి ఆ గనిలో అనుమతులు లేకుండానే మళ్లీ పనులు మొదలుపెట్టారు.
కాలం చెల్లిన గనిలో ముఖ్యనేత పనులు
కన్నెత్తి చూడని అధికారులు

శ్రీనివాసా.. మళ్లీ దొంగాట!
Comments
Please login to add a commentAdd a comment