
ఇంటర్ పరీక్షకు 651 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ పబ్లిక్ పరీక్షలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 28,981 మంది, ఒకేషనల్‌లో 1,357 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా జనరల్‌లో 552 మంది, ఒకేషనల్‌లో 99 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐవో జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
14న స్విమ్స్‌లో
వాక్ ఇన్ ఇంటర్వ్యూ
తిరుపతి తుడా: స్విమ్స్‌లో అడహక్ బేసిస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 38 సీనియర్ రెసిడెన్స్ పోస్టులకు ఈనెల 14వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బట్లా తెలిపారు. హిందూ మతానికి సంబంధిచిన వారు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులను రిజర్వేషన్, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు స్విమ్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
మెగా కార్పొరేట్
క్రీకెట్ లీగ్ ప్రారంభం
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియంలో మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ టీ–20 టోర్నమెంట్‌ను శనివారం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రారంభించారు. పది జట్లకు పైగా పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలిరోజు కలెక్టర్ టీమ్, పోలీస్ టీమ్ తలపడ్డాయి. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, ఆరోగ్య సంరక్షణలో కీడ్రలు ఎంతో ఉపకరిస్తాయన్నారు.

ఇంటర్ పరీక్షకు 651 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment