సేవలు..
సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం కక్షగట్టింది. వివిధ రకాల సర్వేల పేరుతో నిత్యం వేధింపులకు గురిచేస్తోంది. సెలవు రోజుల్లో సైతం శిక్షణ పేరుతో ముప్పతిప్పలు పెడుతోంది. అన్ని శాఖల పనులను వారి నెత్తిపైనే రుద్ది పొమ్మనలేక పొగబెడుతోంది. ఈ క్రమంలోనే ప్రజలకు సకాలంలో సేవలు అందకుండా అడ్డుపడుతోంది. ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థను నీరుగార్చేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు సర్కారు నిర్వాకంతో జనం తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్.. మండల కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. సులభతరంగా అందుతున్న సేవలను దూరం చేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకుల వ్యవహారశైలి మారకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
జిల్లా సమాచారం
మొత్తం సచివాలయాలు 691
ఉద్యోగులు 7,405
సచివాలయాల్లో పౌరసేవలు అందే సమయంలో కలెక్టరేట్ స్పందనకు వచ్చిన అర్జీలు
2023 డిసెంబర్ 554
2024 జనవరి 801
2024 ఫిబ్రవరి 802
కూటమి ప్రభుత్వంలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలు
2024 డిసెంబర్ 942
2025 జనవరి 660
(రెండు వారాలు గ్రీవెన్స్ జరగలేదు)
2025 ఫిబ్రవరి 948
సాక్షి ప్రతినిధి, తిరుపతి : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజా సేవకే పెద్దపీట వేసింది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 35 శాఖలకు సంబంధించి సుమారు 500 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రధానంగా పింఛన్, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, సివిల్ పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, పౌల్ట్రీ వంటి అనేక అంశాలకు సంబంధించిన సేవలను ఆయా గ్రామాల్లోనే ప్రజలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బందికి తోడుగా వలంటీర్లను నియమించింది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేసేలా దిశానిర్దేశం చేసింది.
ఫలితం ఇదీ..
సర్వేల కారణంగా సిబ్బంది పౌరసేవలకు దూరంగా ఉండాల్సి రావటంతో పశు వైద్యం మూగబోయింది. మహిళా పోలీసులను కూడా సర్వేలకు వాడుకోవడంతో పల్లెల్లో సారా, గంజాయి విక్రయాలతోపాటు బెల్టు షాపులు జోరందుకున్నాయి. సచివాలయ సిబ్బంది సర్వేలకు పరిమితం కావడంతో గ్రామస్థాయి నుంచి పైస్థాయికి సమాచారం చేరడం లేదు. కీలకంగా పనిచేయాల్సిన డిజిటల్ అసిస్టెంట్‌లు కూడా గట్టిగా సీట్లో కూర్చులేకపోతున్నారు. వారికి సైతం అదనపు పనులు అప్పగించడంతో ప్రజా సేవలు కుంటుపడుతున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు కూడా పొలం బడిని వదిలేశారు. సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం వివిధ శాఖలకు సర్ధుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
పని చేస్తున్నా.. తప్పని ఫిర్యాదులు
మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టుగా తయారైంది సచివాలయ సిబ్బంది పరిస్థితి. సర్వేలు, సొంత పనులు, సేవలు తలనొప్పిని తెచ్చిపెడుతుంటే.. మరో వైపు కూటమి నేతలు మరింతగా ఇబ్బందిపెడుతున్నారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులపై కావాలనే ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోవడం లేదని జులుం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
కలెక్టరేట్‌కు వినతుల వెల్లువ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 80 శాఖలకు సంబంధించి మొత్తం 3,208 అర్జీలు వచ్చాయి. ఇందులో 1,896 వినతులను పరిష్కరించారు. మిగిలిన 1,312 ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. అయితే పలు అర్జీలకు కచ్చితమైన పరిష్కారం లభించక ప్రజలు మాత్రం కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయా సచివాలయాల్లోనే సమస్యలు పరిష్కారమయ్యేవని అర్జీదారులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేయడంతోనే వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు.
కత్తిగట్టిన కూటమి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థపై కత్తిగట్టింది. పల్లె పాలనను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా తొలుత వలంటీర్లను పక్కనపెట్టేసింది. సచివాలయ సిబ్బందిని పలు సర్వేల పేరుతో వేధిస్తోంది. గతంలోనూ సర్వేలు చేపట్టినప్పటికీ.. పౌరసేవలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రస్తుతం పౌరసేవలను పూర్తిగా పక్కనపెట్టి 36 రకాల సర్వేలను సిబ్బందికి అప్పగించి ఊరూరా తిప్పుతోంది. సెలవు రోజుల్లోనూ సర్వేలపై శిక్షణ అని పిలిపించుకుంటూ ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన పనులను తమపై రుద్దుతుండడంపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయ సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్న ప్రభుత్వం
నాలుగు నెలలుగా 36 రకాల సర్వేలతో ప్రజా సేవకు దూరం
సమస్యలు తీర్చేవారు లేక కలెక్టరేట్,
మండల కార్యాలయాలకు జనం
పెరిగిన ఒత్తిడి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా సర్వే అంటేనే భయపడే దుస్థితి దాపురించింది. తెల్లారితే సర్వే అని మొదలుపెడితే సాయంత్రానికి సర్వర్ డౌన్‌వుతోంది. రాత్రి ఇంటికి వెళ్లే సరికి సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఆపై కూడా పంచాయతీ కార్యదర్శులు సర్వేలు చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటనకు వస్తే వారి మీటింగ్‌ల నిర్వహణ చూసుకోవాలి.
సేవలు..
సేవలు..
Comments
Please login to add a commentAdd a comment