తిరుమలలో విస్తృత తనిఖీలు
తిరుమల : తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నందకం, వకుళమాత, వరాహస్వామి అతిథిగృహాల వద్ద అనధికారికంగా వ్యాపారాలు సాగిస్తున్న 25 మంది నానల్ లోకల్, హ్యాకర్లను గుర్తించారు. నేర చరిత్ర ఏమైనా ఉందా తెలుసుకునేందుకు వేలిముద్రలు సేకరించారు. తిరుమలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
అంబేడ్కర్ వర్సిటీని
ఏర్పాటు చేయాలి
తిరుపతి సిటీ: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని తక్షణం ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. స్టడీసెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వై మల్లికార్జున మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11ఏళ్లు పైబడినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నుంచి ఎక్కువ మంది యూజీ, పీజీ, డిప్లొమో కోర్సులలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం తక్షణం వర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల అంబేడ్కర్ స్టడీసెంటర్ విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుమలలో విస్తృత తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment