
భూసేకరణ వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి వర్చువల్ పద్ధతిలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పెండింగ్ పనులు పూర్తి చేయించే దిశగా ఆర్డీఓలు పర్యవేక్షించాలని చెప్పారు. సాగరమాల కింద చేపట్టనున్న 2, 3, 4 ప్యాకేజీ జా తీయ రహదారి పనులు జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, తిరుపతి, నెల్లూరు, చైన్నె నేషనల్ హైవ్ పీడీలు వెంకటేష్, ఎంకే చౌదరి, రవీంద్రరావు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామమోహన్, భానుప్రకాష్‌రెడ్డి, కిరణ్మయి, పలువురు తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఇక ఉదయం 9 నుంచే గ్రీవెన్స్
– మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ అమలు
తిరుపతి అర్బన్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9 కే ప్రారంభించి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 9 కే మొదలు పెట్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే సోమవారం నుంచి ఈ పద్ధతిలో ఉంటుందన్నా రు. జిల్లా కలెక్టరేట్‌లోనే కాకుండా డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద యం 9 గంటల నుంచే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
శతపథికి అవార్డు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ మా జీ వీసీ, ప్రస్తుతం ఐఐటీ భువనేశ్వర్‌లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ హరేకృష్ణ శతపథికి శ్రీభాష్యం పార్ధసారథి రాష్ట్రీయ అవా ర్డు ప్రదానం చేశారు. మంగళవారం హైదరాబాద్ వేదికగా ఉస్మానియా వర్సిటీ సంస్కృత అకాడ మీ, సర్వ వైదిక సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవా ర్డు అందుకున్నారు. సంస్కృత సాహిత్యం, భారతీయ సంస్కృతి, అకడమిక్ పరిపాలనలో విశేష సేవలు అందించినందుకు పురస్కారాన్ని అందజేశారు.

భూసేకరణ వేగవంతం చేయండి
Comments
Please login to add a commentAdd a comment