
శ్రీసిటీలో నేషనల్ డిఫెన్స్ కళాశాల అధికారులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): భారతదేశ పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధిపై అధ్యయనంలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (ఎన్‌డీసీ)కి చెందిన 17 మంది సభ్యుల ప్రతినిధి బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. మేజర్ జనరల్ సీపీ సంగ్రా, ఏవీఎస్‌ఎం వైఎస్‌ఎం(రిటైర్డ్) నేతృత్వంలో భారత సాయుధ దళాల ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులతో సహా విచ్చేసిన బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ఏకీకృత వ్యాపారానుకూల వాతావరణం, ప్రపంచ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం, భారతదేశ తయారీ, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, డిఫెన్‌న్స్ రంగాల్లో భాగస్వామ్యం గురించి ఆయన వారికి వివరించారు. పర్యటన కోఆర్డినేటర్‌లుగా ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీఐ) డైరెక్టర్ జి.శ్రీనివాసులు, కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment