
జూడాల వినూత్న నిరసన
తిరుపతి సిటీ: ఎస్వీ వెటర్నరీ కళాశాలలో గౌరవ వేతనం పెంచాలంటూ గత 44 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థులు మంగళవారం వినూత్న నిరసనలతో హోరెత్తించారు. వెటర్నరీ రంగం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో కూడిన గణాంకాలను ప్రదరిస్తూ ముఖాలకు మాస్కులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పశువైద్య విభాగం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు ఆదాయం సమకూరుతున్నా, వైద్య విద్యార్థుల న్యాయపరమైన డిమాండును పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు వర్సిటీ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా తమ సమస్యను పరిష్కరించ డం లేదని వాపోయారు. సమస్య పరిష్కారమ య్యే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment