
మైక్రో ఇరిగేషన్ పురోగతిపై చర్యలేంటి?
తిరుపతి మంగళం : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, ఆ జిల్లాలో సాధించిన పురోగతి, లబ్ధిదారులు వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. ఈ విషయంపై మంగళవారం ఢిల్లీ పార్లమెంట్‌లో ఎంపీ ప్రశ్నించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015–16 నుంచి దేశవ్యాప్తంగా అమలులో ఉందని, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో–ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు. తిరుపతి జిల్లాలో 20,819 హెక్టార్లు మైక్రో–ఇరిగేషన్ కింద కవర్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు, వారికి అందిస్తున్న ఆర్థిక సహాయం వివరాలు వెల్లడిస్తూ సన్న, చిన్నకారు రైతులకు 55శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 45 శాతం సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు.
పార్లమెంటులో తిరుపతి ఎంపీ
మద్దిల గురుమూర్తి
Comments
Please login to add a commentAdd a comment