
వడదెబ్బపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ
తిరుపతి తుడా: ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరో గ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బ్యానర్లు, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాఇ మ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతకుమారి, డి ప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మురళీకృష్ణ, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ రూప్‌కుమా ర్, జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ మధుబాబు, లావణ్య, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 70,824 మంది స్వామివారిని దర్శించుకోగా 25,674 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment