నాణ్యమైన భోజనం వడ్డించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం వడ్డించాలి

Published Fri, Jan 31 2025 8:00 AM | Last Updated on Fri, Jan 31 2025 8:00 AM

నాణ్య

నాణ్యమైన భోజనం వడ్డించాలి

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

కొడంగల్‌: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వాష్‌రూంను ప్రతి రోజు శుభ్రం చేయాలన్నారు. స్టోర్‌ రూంలోని బియ్యం నాణ్యతను గమనించారు. బియ్యం సరిగ్గా లేకపోతే తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగునంగా సదుపాయాలు కల్పించాలన్నారు. లైట్లు, ప్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి

ఎంతో పవిత్రమైనది

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

నవాబుపేట: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని ఎకమామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన శివ కుమార్‌ వికారాబాద్‌లోని బసంత్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయ పాత్ర ఎంతో కీలకమన్నారు. శివకుమార్‌ ఉపాధ్యాయునిగా పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకుడిగా మంచి సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కడియాల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పూడూరు డిప్యూటీ

తహసీల్దార్‌ సస్పెన్షన్‌

పూడూరు: భూముల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు పాల్పడినందుకు పూడూరు డిప్యూటీ తాహసీల్దార్‌ కిషోర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పూడూరు తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న సిహెచ్‌.కిషోర్‌ మండలంలోని చనుగోముల్‌ గ్రామం సర్వే నెంబర్‌ 496లో 1,022 ఎకరాల భూమికి సంబంధించి ధరణిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా ఆయనను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సస్పెన్షన్‌ కాలంలో కిషోర్‌ ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాన్ని వదిలి వెళ్లరాదని కలెక్టర్‌ ఆదేశించారు.

కౌన్సిల్‌ మాజీ సభ్యులకుఘనంగా వీడ్కోలు

తాండూరు: పదవీకాలం ముగిసిన మున్సిపల్‌ పాలక వర్గానికి గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. తాండూరు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ విక్రంసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్‌, మాజీ కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ నరేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు నీరజా బాల్‌రెడడి, అబ్దుల్‌ రజాక్‌, వరాల శ్రీనివాస్‌రెడ్డి, రత్నమాల నర్సింహులు, భీంసింగ్‌ రాఽథోడ్‌, ప్రవీణ్‌గౌడ్‌, సాహు శ్రీలత, అంతారం లలిత, బొబ్బిలి శోభారాణి, బాంబానా, వెంకన్నగౌడ్‌, రామకృష్ణ, బోయ రవిరాజ్‌, సల్మాఫాతిమా, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నాణ్యమైన భోజనం  వడ్డించాలి 
1
1/1

నాణ్యమైన భోజనం వడ్డించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement