ప్రజలతో మమేకం కండి | - | Sakshi
Sakshi News home page

ప్రజలతో మమేకం కండి

Published Fri, Jan 31 2025 8:00 AM | Last Updated on Fri, Jan 31 2025 8:00 AM

ప్రజలతో మమేకం కండి

ప్రజలతో మమేకం కండి

బంట్వారం: పోలీసులు ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీగా పని చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కోట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు ల స్థితిగతులపై ధారురు సీఐ రఘురాములు, స్థాని క ఎస్సై గఫార్‌కు సూచనలు చేశారు. ఎట్టిపరిస్థితు ల్లో కేసులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు.నేరం చేసిన వారు తప్పించుకోకుండా దర్యాప్తు చేయాలన్నారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా మరింత చేరువ కావాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని అవసరం ఉన్న సమయంలో ఉపయోగించాలన్నారు. నేరాల నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని అందుకు అనుగుణంగా పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. నిత్యం వాహనాలు తనిఖీ చేయాలని బ్లూ కోల్ట్స్‌ పెట్రోల్‌ కారు విధులు నిర్వహించే వారు విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకొని పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, వ్యాపారులపై నిఘాను పటిష్టం చేయాలన్నారు. సమస్యలు సృష్టించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే రౌడీ షీట్స్‌ ఓపెన్‌ చేయాలని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ధారూరు సీఐ రఘురాములు, కోట్‌పల్లి ఎస్సై అబ్దుల్‌ గఫార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ నారాయణరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement