హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పరిగి: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అయిన సందర్భంగా గురువారం గాంధీ విగ్రహానికి హామీలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు హామీలను అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసి విస్మరించారన్నారు. రైతు భరోసా అందిస్తామని చెప్పి మండలానికి ఒక్క గ్రామానికి అమలు చేస్తున్నట్టు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఒకేసారి నాలుగు హామీలు అమలు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం ఒక్క హమీ అమలు కాకపోవడంతో గ్రామాల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు బూటకపు మాటలు చెప్పి ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదన్నారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, కంకల్ ప్రభాకర్‌గుప్తా, రాజేందర్, తాహేర్, రవి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో..
అనంతగిరి: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. గురువారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఎంతో ఆదర్శంగా సాగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సర్వేల పేరుతో పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. వెంటనే ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, గోపాల్, అనంతరెడ్డి, రామస్వామి, కృష్ణారెడ్డి, విజయ్ కుమార్, రాములు, లక్ష్మణ్, గయాజ్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment