యాచారం: ఇటీవల అపరచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు స్పందిస్తూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.5లక్షల ముద్రలోన్ మంజూరైందని చెప్పిన వెంటనే బాధితుడు అపరిచిత వ్యక్తిన చెప్పిన విధంగా విడతల వారీగా రూ.45,490 పంపించాడు. ఆతరువాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గునుగల్ గ్రామానికి చెందిన రామన్నకు ఈ నెల 4న అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. నీకు రూ.5 లక్షల ముద్రలోన్ మంజూరైందని తాను పంపే స్కానర్‌కు రూ.50వేలు పంపించాలని రామన్న వాట్సాప్‌కు స్కానర్ పంపించాడు. దీంతో విడతల వారీగా రూ.45,490 పంపాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
‘చెత్తవేస్తే ఈ–చలాన్’పై
అధికారులకు శిక్షణ
సాక్షి,సిటీబ్యూరో: ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలు వేసేవారిని గుర్తించి ఈ–చలాన్ ద్వారా పెనాల్టీలు విధించి, యూపీఐ ద్వారా వసూలు చేసేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ సంబంధిత ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్, ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ–చలాన్ విధించేందుకు టీసీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన విధానాన్ని, యాప్‌ను కాంప్రహెన్సివ్ చలాన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీసీఎంఎస్) యాప్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు యాప్‌ను నిర్వహించే టీజీ ఆన్‌లైన్ ప్రతినిధులు యాప్ ఎలా పనిచేస్తుందో, ఎలా వాడాలో వివరించారు. తొలుత పైలట్‌గా చెత్త డబ్బాల్లో కాకుండా బయట చెత్తవేసే వాణిజ్య ప్రాంతాల్లోని వ్యాపారులు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నవారు, సీఅండ్‌డీ వేస్ట్ వేస్తున్న వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు. సంబంధిత అధికారులు జారీ అయిన చలాన్‌లు, చెల్లింపులు జరిగినవి, పెండింగ్‌లో ఉన్నవి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చునన్నారు. చెత్త వేసేవారికి ఎస్‌ఎంఎస్ వెళ్తుందని, స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించి వేసిన వ్యర్థాల ఫొటో అక్షాంక్ష, రేఖాంశలతో వస్తుందన్నారు. దేనికి ఎంత పెనాల్టీయో సాఫ్ట్‌వేర్‌లోనే పొందుపరిచి ఉంటుందని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment