నేడు ఎల్లమ్మ జాతర
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్ శివారులో వెలిసిన రాంపురం ఎల్లమ్మ జాతర శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సురేశ్ గౌడ్ గురువారం తెలిపారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు, సాయంత్రం పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అన్నదానం చేస్తారు. జాతరకు హస్నాబాద్, ఆలేడ్, కుదురుమల్ల, పెద్ద నందిగామ, సంగాయిపల్లి తండా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
హెల్త్ అసిస్టెంట్‌కు
గౌరవ డాక్టరేట్
కుల్కచర్ల: చౌడాపూర్ మండలం మరికల్ క్లస్టర్ హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శరభలింగంకు పర్యావరణ పరిరక్షణ కమిషన్ న్యూఢీల్లీ వారు బుధవారం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. కరోనా సమయంలో ప్రజలను చైతన్య పరచడంలో ఆయన చేసిన కృషికి గాను అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సామాజిక కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ పట్టా బహూకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే తన బాధ్యతలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం పట్ల యువత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉపవాస దీక్షల
కార్డు విడుదల
అనంతగిరి: రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షల సమయ సారిణి పట్టిక కార్డును గురువారం వికారాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ విడుదల చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తస్వర్ అలీ, హాషం, సయ్యద్ మతీన్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు
కందుకూరు: యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, ఇతర ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన ఏఓ లావణ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఎంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరు వరకు యూరియా డిమాండ్ ఉన్నందున దాని కి అనుగుణంగా నిల్వలను తెప్పించుకోవాలని ఏఓకు సూచించాచారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నిల్వలను చూసుకోవాలన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అప్పుడే వారిలో సృజనాత్మకత పెంపొందుతుందని ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ స్థాయి సాంకేతిక, క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఆవిష్కరణలు వెలికితీయటానికి అవకాశం ఉంటుందన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన విలువైన విద్యను అభ్యసించాలని తెలిపారు. వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆవిష్కరణలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, సెక్రెటరీ నవీన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ నబి పాల్గొన్నారు.
నేడు ఎల్లమ్మ జాతర
నేడు ఎల్లమ్మ జాతర
Comments
Please login to add a commentAdd a comment