● యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం ● ఘనంగా స్వయం పరిపాలన, పాఠశాల వార్షికోత్సవం
బొంరాస్‌పేట: ప్రభుత్వ పాఠశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచి సౌకర్యాలు ఉన్నాయని, పాఠశాల స్థాయిని పోగొట్టుకోరాదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి ఎంపీ యూపీఎస్‌లో స్వయం పరిపాలన, వార్షికోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ బడుల మనుగడ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఎనిమిదో తరగతి వరకు పదేళ్ల క్రితం స్థాయి పెరిగిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, పదో తరగతి వరకు తరగతులను పెంచుకొని ఉన్నత పాఠశాల నిలబెట్టుకోవాలన్నారు. అందుకు రేగడిమైలారం ఆరద్శంగా భావించాలన్నారు. విద్యార్థుల సందేశాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
స్వయం పరిపాలనలో ప్రతిభ
స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వి ద్యార్థులే ఉపాధ్యాలయ్యారు. 16మంది విద్యార్థులు అధికారులు, ఉపాధ్యాయులుగా ఒక్క రోజు విధులు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. కలెక్టర్‌గా నరేశ్, డీఈఓగా పుష్పలత, ఎంఈఓగా మహేశ్, సీహెచ్‌ఎంగా మోహన్, హెచ్‌ఎంగా భవాని, ఉపాధ్యాయులుగా మాధవి, ముబీన, స్నేహశ్రీ, నిశిత్, విరాట్, నందిని, శిరీష, సింధూజ, డ్రాయింగ్ నాని, పీఈటీగా శివసాయి, అటెండర్‌గా శివానంద్ విధులు నిర్వహించారు. వీరికి బహుమతులు అందజేశారు. వడిచర్ల హెచ్‌ఎం నరేందర్‌గౌడ్, హెచ్‌ఎం జ్యోతి పరమేశ్వరి, నాయకులు శేఖర్, నర్సింలు, మాణెమ్మ, చంద్రమ్మ, ఉపాధ్యాయులు మహేశ్‌కుమార్, అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు శివనీల, సంతోష, అంజిలప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment