ప్రవీణ్ మృతదేహం అప్పగింత
కేశంపేట: అమెరికాలో మృతి చెందిన విద్యార్థి ప్రవీణ్‌కుమార్ మృతదేహానికి భారతకాలమానం ప్రకారం గురువారం అక్కడి అధికారులు పోస్టుమార్టం పూర్తిచేశారు. మృతుడి తలలోని బుల్లెట్‌ను తొలగించి, మృతదేహాన్ని తానా సభ్యులకు అప్పగించగా, వారు ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేటీఆర్ పరామర్శ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రవీణ్ తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించారు. కేశంపేటలో మృతుడి తల్లిదండ్రులు రాఘవులు, రమాదేవిని కలిసిన ఆ పార్టీ నేతలు ఎల్గనమోని రవీందర్‌యాదవ్, మురళీధర్‌రెడ్డి, నర్సింగ్‌రావు తదితరులు కేటీఆర్‌తో ఫోన్ మాట్లాడించారు. బాధితులను ఓదార్చిన ఆయన ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సెక్రటేరియట్ నుంచి వివరాల సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసిన అధికారులు రాఘవులుతో మాట్లాడారు. మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రవీణ్ వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో వివరాలు పంపించారు.
పోస్టుమార్టం అనంతరం తానా సభ్యులకు ఇచ్చినట్లు సమాచారం
ఇండియా పంపేందుకు ఏర్పాట్లు
మృతుడి తల్లిదండ్రులకు పలువురి పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment