వెయిట్‌లిఫ్టర్ అంజలికి సన్మానం
కుల్కచర్ల: వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్న అంతారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీరటి అంజలిని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల అంజలికి ప్రశంసా పత్రం అందజేసి, సన్మానించారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో అంజలి రాష్ట్రస్థాయి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
భూ నిర్వాసితులకు చెక్కులు
అనంతగిరి: ప్రభుత్వం అందజేసిన నష్ట పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు సూచించారు. దుద్యాల మండలం హకీంపేటకు చెందిన భూ నిర్వాసితులకు మంజూరైన చెక్కులను అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, దుద్యాల తహసీల్దార్ కిషన్‌తో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
సీఎమ్మార్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదు
పరిగి: సీఎమ్మార్ బియ్యం అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ హెచ్చరించారు. పరిగిలోని న్యూ ఇండియన్ రైస్ మిల్లు శ్రీశివకృష్ణ రైస్ మిల్లులను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. సకాలంలో బియ్యం అందించి సహకరించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీఎస్‌సీఎం వెంకటేశ్వర్లు, సంతోష్, విజయ్ తదితరులు ఉన్నారు.
పత్తి దిగుబడి పెంచాలి
జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి
తాండూరు టౌన్: పత్తి అధిక సాంద్రతతో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఏఓ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని ఏళ్లుగా పత్తి దిగుబడి నిలకడగా ఉందని.. ఇది పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధిక సాంద్రతలో పత్తిని సాగుచేయడం వల్ల పంట కాలం తగ్గించుకోవచ్చన్నారు. రెండో పంటగా పెసర, మినుములు వేసుకుని రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఏరువాక కో–ఆర్డినేటర్ టి.లక్ష్మణ్, ప్రధాన శాస్త్రవేత్త కె.పరిమళ, శాస్త్రవేత్తలు సునీత, సుజాత, శేఖర్ మాట్లాడుతూ.. వివిధ పంటల్లో కొత్తగా విడుదలైన వంగడాలపై రైతులు అవగాహన ఉండాలన్నారు. తేనెటీగల పెంపకాన్ని చేపట్టి అధిక లాభాలను పొందవచ్చన్నారు. జొన్న పంటలో యాజమా న్య పద్ధతులను పాటించాలన్నారు. పంటల్లో కలుపు మొక్కల యాజమాన్యం, వాటిని తొలగించుటలో కలుపు మందు పిచికారీపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఆర్సీ విస్తరణ సలహా మండలి సభ్యులు ద్యావరి నారాయణ, వ్యవసాయాధికారులు కిషోర్, రత్నమాల, కేశ వ కృష్ణ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
వెయిట్‌లిఫ్టర్ అంజలికి సన్మానం
వెయిట్‌లిఫ్టర్ అంజలికి సన్మానం
వెయిట్‌లిఫ్టర్ అంజలికి సన్మానం
Comments
Please login to add a commentAdd a comment