వేలకోళ్లు మృత్యువాత
యాచారం: మండల పరిధిలోని నానక్‌నగర్ గ్రామంలో రెండు రోజుల వ్యవధిలోనే 12 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన చల్లా కృష్ణారెడ్డి రూ.5 లక్షలు ఖర్చు చేసి తన పౌల్ట్రీ షెడ్లలో కోడిపిల్లల పెంపకం చేపట్టాడు. బర్డ్ ప్లూ భయంతో చికెన్ అమ్మకాలు పడిపోవడంతో షెడ్లలో ఉన్న కోళ్లను 40 రోజుల దాటినా ఇంటిగ్రేషన్ కంపెనీలు తరలించడం లేదు. దాదాపు రెండున్నర కిలోల బరువు పెరిగిన 12 వేల కోళ్లు శని, ఆదివారాల్లో అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్లను చల్లా కృష్ణారెడ్డి తన వ్యవసాయ పొలంలోనే గోతులు తీసి పూడ్చిపెట్టాడు. ఇదే గ్రామానికి చెందిన ముత్యాల వెంకట్‌రెడ్డి అనే రైతుకు చెందిన రెండు షెడ్లలో ఉన్న ఏడు వేల కోళ్లు సైతం నాలుగైదు రోజుల క్రితం మృతి చెందాయి. దీంతో రూ.లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని ఆ రైతులు బోరుమంటున్నారు. కంపెనీల వై ద్యులు వచ్చి బర్డ్ ప్లూ వైరస్‌తోనే కోళ్లు చనిపోయాయని చెప్పినట్టు వారు తెలిపారు. ఒకేసారి వే లాది కోళ్లు మృత్యువాత పడుతుండడంతో మిగతా రైతులు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
కోళ్లు పూడ్చేశారు.. నిర్ధారించలేం..
నానక్‌నగర్‌లో నాలుగైదు రోజుల్లోనే 19 వేల కోళ్లు మృతి చెందాయని ఆలస్యంగా సమాచారం తెలిసిందని నక్కర్తమేడిపల్లి పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన గ్రామానికి చేరుకుని బాధిత రైతులు ముత్యాల వెంకట్‌రెడ్డి, చల్లా కృష్ణారెడ్డి షెడ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే రైతులు మృతి చెందిన కోళ్లను పూడ్చేశారు. కోళ్లు లేనందున బర్డ్‌ఫ్లూతోనే మృతి చెందాయని నిర్ధారణ చేయలేమని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తానని చెప్పారు.
రెండు రోజుల వ్యధిలో 12 వేలు..
నాలుగు రోజుల క్రితం 7 వేలు..
రూ.లక్షల్లో నష్టపోయిన రైతులు
వేలకోళ్లు మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment