
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వారు చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సమీర్, చరణ్‌గౌడ్, చందు, చారి, వినీత్, ఆదిత్య, విష్ణుగుప్తా, ఇర్ఫాన్, వివేకానంద, శశి, ఆకాశ్, షోఫాయాన్, విష్ణు, శివ, నవీన్, కార్తీక్, మైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్
అధ్యక్షుడు శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment