పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, పీఎస్ కస్టోడియన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించరాదని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు కేటాయించిన అధికారులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించరాదన్నారు. అలాగే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఈఓ రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ డిపోకు
16 కొత్త బస్సులు
అనంతగిరి: వికారాబాద్ ఆర్టీసీ డిపోకు ప్రభు త్వం 16 కొత్త బస్సులను కేటాయించింది. మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని.. వికారాబాద్ డిపోకు మరిన్ని కొత్త బస్సులు కేటాయించాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్‌ను కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు 16 కొత్త బస్సులను కేటాయించడం జరిగింది. ఈ బస్సుల రాకతో వికారాబాద్ నియో జకవర్గం పరిధిలో ప్రయాణం సులభతరమవుతుందని, కొత్త బస్సులు మంజూరు చేసిన మంత్రి పొన్నంకు స్పీకర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
పీఎస్ జేఏసీ జిల్లా చైర్మన్‌గా కిషన్‌రెడ్డి
అనంతగిరి: జిల్లా పంచాయతీ సెక్రటరీస్ జేఏసీ చైర్మన్‌గా బి.కిషన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. మంగళవారం వికారాబాద్‌లో జిల్లా పంచాయతీ సెక్రటరీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా కిషన్‌రెడ్డి, వైస్ చైర్మన్లుగా బాల రంగాచారి, మహేశ్వరి, జనరల్ సెక్రటరీగా కృష్ణ, ట్రెజరర్‌గా సత్యనారాయణను ఎన్నుకున్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను ఏకతాటిపైకి తీసుకువచ్చి జేఏసీ బలోపేతం చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సీనియర్ కార్యదర్శులు ప్రసన్నకుమార్, రాములు, రాజు, మధుకర్‌రెడ్డి, శ హేందర్‌రెడ్డి, రాంచందర్, రామకృష్ణ, రమేష్, రవిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
అనంతుడి సేవలో
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
అనంతగిరి: బీజేపీ జి ల్లా అధ్యక్షుడిగా నియ మితులైన డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి మంగళవా రం అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి ఆశీర్వాదంతో ముందుకు సాగుతానని తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఆయన వెంట ధార్మిక సెల్ కన్వీనర్ మోహన్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్ రాఘవేందర్, నాయకులు శివరాజు, గొడుగు సుధాకర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మధ్యాహ్న భోజనం కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రమోహన్ మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్నతో కలిసి మాట్లాడారు.
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి