విశాఖస్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆటగాళ్లు వ్యాయామంతో పాటు ప్రాక్టీస్ చేశారు. వారం రోజుల పాటు విశాఖలోనే ఆ జట్టు ప్రాక్టీస్ చేయనుంది. వైఎస్సార్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న డీసీ తొలి రెండు మ్యాచ్‌లను ఇక్కడే ఆడనుంది.
ఈ నెల 31న డిఫెండింగ్ చాంప్ హోదాలో బరిలోకి దిగుతున్న చైన్నె సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో, ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్)తో తలపడనుంది. ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ కోలుకుని.. చురుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు టాపార్డర్ బ్యాటర్‌గా విశాఖ కుర్రాడు రికీబుయ్ సత్తా చాటనున్నాడు. స్థానిక కుర్రాడు కె.ఎస్.భరత్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనుండగా.. ఆంధ్రా ఆటగాడు రషీద్ చైన్నె సూపర్‌కింగ్స్ తరఫున విశాఖలో జరిగే మ్యాచ్‌లో బరిలో దిగనున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment