● అక్రమంగా సిమ్‌కార్డుల రవాణా
బనశంకరి (బెంగళూరు): భారత సిమ్‌కార్డును వినియోగించి విదేశాల్లో నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా సమాచారాన్ని బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్‌క్రైం పోలీసులు ఛేదించారు. వంచక ముఠాకు సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముఠా నేరగాళ్లు నకిలీ ఆధారాలను అందించి ఏజెంట్ల ద్వారా వివిధ కంపెనీల సిమ్‌కార్డులను కొనుగోలు చేశారు. బెంగళూరు, చైన్నె, విశాఖపట్టణంతో పాటు దేశంలోని వివిధ మహా నగరాల నుంచి సిమ్‌కార్డులను కొని, యాక్టివేట్ చేసి వియత్నాం, కాంబోడియాకు కొరియర్ ద్వారా పంపించేవారని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడి నుంచి కాంబోడియాకు సిమ్‌కార్డులు పంపించేవాడు. అతనిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
