● గతంలో మహిళా సీఐ ఫిర్యాదు ● తాజాగా మహిళా ఏఎస్‌ఐ కూడా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ● ఉన్నతాధికారుల దృష్టికి ఏసీపీ వ్యవహారం
విశాఖ సిటీ : మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే పోలీస్‌స్టేషన్ మహిళా సిబ్బందే.. తమ పై అధికారి వేధింపులు భరించలేకపోతున్నామని వరుస ఫిర్యాదులు చేస్తుండడం విశాఖ పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఒక మహిళా సీఐ, తాజాగా ఒక మహిళా ఏఎస్‌ఐ సంబంధిత ఏసీపీపైనే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ పెంటారావు పరుషంగా మాట్లాడడంతో పాటు ఇష్టానుసారంగా విధులు కేటాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. దీనిపై ఏఎస్‌ఐ నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. గతంలో ఒక మహిళా సీఐ కూడా ఏసీపీ వ్యవహార శైలి, మాటతీరుపై సీపీకి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కూడా సీపీ అతనిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. తాజా ఫిర్యాదుపై కూడా విచారణ చేయించి నివేదికను డీజీ కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఏసీపీ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్లు పోలీస్ శాఖలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఏసీపీపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment