విశాఖ సిటీ: ప్రణాళిక విభాగం పనితీరును మెరుగుపర్చుకోవాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం ఆయన తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనులను వేగవంతం చేయాలని, స్థానిక ఎమ్మెల్యేల సహకారం, సమన్వయంతో ముందుకు సాగా లని సూచించారు. పూర్తయిన పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్ప, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన గణంకాధికారి హరిప్రసాద్, డివిజనల్ అటవీ అధికారి శివానీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment