ఆరిలోవ: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి దుర్గాబజార్‌లో నివాసముంటున్న బి.మణికంఠ(45) 10వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ఫోన్ చూడవద్దంటూ హెచ్చరించారు. దీంతో కుమార్తె నిరాకరించడంతో మనస్తాపంతో ఆయన గత నెల 24న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అప్పటికే కొన ఊపిరితో ఉన్న మణికంఠను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment