నైవేద్యం హోటల్ ప్రారంభం
సింహాచలం: హనుమంతవాక నుంచి అడవివరం వెళ్లే బీఆర్‌టీఎస్ రోడ్డు.. సింహాచలం కొండపైకి వెళ్లే రెండో ఘాట్‌రోడ్డు టోల్‌గేట్‌కు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన నైవేద్యం అల్పాహార హోటల్‌ను త్రిదండి చినజీయర్‌స్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా చినజీయర్‌స్వామి మాట్లాడుతూ పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పెంకుటింట్లో సంప్రదాయ రుచులతో నైవేద్యం హోటల్‌ను ఏర్పాటు చేయడం ఎంతో బాగుందన్నారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని వాకాడ రాజశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు వాకాడ శరత్‌కుమార్‌రెడ్డిలకు ఆశీసులు అందజేశారు. ఈనెల 14 నుంచి హోటల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. హోటల్‌లో ఏర్పాటు చేసిన కిచెన్‌ను సైకాలజిస్ట్ కర్రి భాగ్యార్కసిన్హా ప్రారంభించారు. కర్రి పాపారాయుడు, సీఐ డాక్టర్ బెండి వెంకట్రావు, వర్మ, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment