తాటిచెట్లపాలెం: హోలీ సందర్భంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ● భువనేశ్వర్–చర్లపల్లి(08479) స్పెషల్ ఈ నెల 10, 17, 24వ తేదీల్లో భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు చర్లపల్లి వెళ్తుంది. చర్లపల్లి–భువనేశ్వర్(08480) హోలీ స్పెషల్ ఈ నెల 11, 18, 25వ తేదీల్లో ఉదయం 9.50గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.10గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు(08549) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9, 16, 23వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది. ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08550) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10, 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ● బనారస్–విశాఖపట్నం(05042) వన్ వే స్పెషల్ ఈ నెల 8వ తేదీ రాత్రి 10.50 గంటలకు బనారస్‌లో బయల్దేరి 10వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ● ఆజంఘడ్–విశాఖపట్నం (05040) వన్ వే స్పెషల్ ఈ నెల 8న రాత్రి 11.55 గంటలకు ఆజంఘడ్‌లో బయల్దేరి 10వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
జిల్లా టూరిజం ఇన్‌చార్జ్ అధికారిగా సుధాసాగర్
సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ కోల్పోయిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టిన పర్యాటక శాఖ.. ఏం చెయ్యాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇన్‌చార్జ్ ఆర్‌డీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రమణ ప్రసాద్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో.. బ్లూఫ్లాగ్ బీచ్ ఆనవాళ్లు కోల్పోయి.. గుర్తింపు కూడా రద్దైన విషయం తెలిసిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన.. హడావిడిగా ప్రభుత్వం అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ నిర్వహించిన నాలుగు రోజులకే మళ్లీ ఆర్డర్లు మార్చేశారు. ముందుగా జిల్లా టూరిజం అధికారిగా ప్రస్తుతం అల్లూరి జిల్లా డీటీవోగా వ్యవహరిస్తున్న గరికిన దాసుని నియమిస్తూ పర్యాటక శాఖ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టేలోపే.. మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. వాస్తవానికి దాసు శుక్రవారం డీటీవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. ఈలోగా.. గురవారం అర్ధరాత్రి డీటీవోగా డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పర్యాటకశాఖ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం సుధాసాగర్ హెచ్‌పీసీఎల్ ల్యాండ్ ఎక్విజిషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అనకాపల్లిలో బీబీఎస్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
ఎంవీపీకాలనీ: రామేశ్వరం–భువనేశ్వర్ మధ్య ప్రయాణించే బీబీఎస్ వీక్లీ ఎక్స్‌ప్రెస్(20895/96) అనకాపల్లి స్టేషన్‌లో ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ రైలు అనకాపల్లిలో హాల్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment