
24 ఏళ్లుగా నవ్విస్తూ...
సీతంపేట: ఆమె స్టేజి ఎక్కితే కడుపుచెక్కలుకావాల్సిందే..ఆమె టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. హాస్య నటిగా శివజ్యోతి సుపరిచితురాలు. 2000 సంవత్సరంలో రావి కొండలరావు స్థాపించిన హ్యూమర్ క్లబ్‌లో ఆమె సభ్యురాలు..నాటి నుంచి నేటి వరకు నవ్వులు పంచుతున్నారు. కష్టాలు..కన్నీళ్లు..బాధలు..వీటినన్నింటినీ చిటికెలో మాయం చేసేది హాస్యం. నా స్కిట్లకు ప్రేక్షకులు నవ్వుతుంటే ఆ ఆనందం వేరు అంటున్నారు జ్యోతి. ప్రస్తుతం ఫ్రెండ్స్ కామెడీక్లబ్‌తో పాటు మరో రెండు కామెడీక్లబ్స్‌లో ప్రతి ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నా... దాదాపు 24 ఏళ్లుగా నవ్విస్తుంటం నా అదృష్టంగా భావిస్తున్నా. 1978 నుంచి కూచిపూడి డ్యాన్సర్‌గా, 1989 నుంచి రంగస్థల కళాకారిణిగా వందలాది స్టేజి ప్రదర్శనలు ఇచ్చా. జేవీ సోమయాజులతో కలిసి బుచ్చమ్మ పాత్ర (కన్యాశుల్కం)ధారిగా 500లకు పైగా ప్రదర్శనలు ఇచ్చా..కందుకూరి, నంది అవార్డు, కళాభినేత్రి, హాస్య నటి శిరోమణి, నాట్య మయూరిగా ఎన్నో అవార్డులు అందుకున్నా.
Comments
Please login to add a commentAdd a comment