వైద్య వృత్తి.. సేవా కీర్తి
విశాఖ విద్య: విశాఖ నగరంలోని మర్రిపాలెం వుడా లే అవుట్ కాలనీకి చెందిన కంచిపాటి శిరీష దంతవైద్యురాలు. భర్త శ్రీనివాసరావు కూడా వైద్యుడే. ఎంచక్కా ఏ ప్రైవేటు ఆస్పత్రో పెట్టుకొని ప్రాక్టీస్‌పై దృష్టి పెడితే, బోలెడంత వెనుకేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పాస్తులు, కుటుంబ పరంగా ఉన్న అండదండలతో లగ్జరీ లైఫ్ గడిపేయవచ్చు. డాక్టర్ శిరీష ఆలోచనలు వేరు..తల్లిదండ్రులు పీవీఎస్‌రావు, విజయలక్ష్మి నేర్పి న విలువలతో ఆమె స్ఫూర్తివంతమైన జీవ నం గడుపుతున్నారు. మర్రిపాలెం వుడా లే అవుట్ కాలనీ అంటే నగరంలోని ప్రముఖుల నివాస స్థావరంగా గుర్తింపు ఉంది. ఇలాంటి చోట, కాలనీ అసోసియేషన్‌లో డాక్టర్ శిరీష కీలకంగా వ్యవహరిస్తున్నారు. సన్నిహితుల ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారి శ్రామిక ప్రాంతాలతో పాటు, నగర శివారు కాలనీలో వైద్య శిబిరాలను ఏర్పా టు చేసి ఉచితంగా రోగులకు మందులను అందజేస్తున్నారు. అంతేకాకుండా కళలు, సాహిత్య రంగాల్లో కూడా పేరుతెచ్చుకున్నారు.
మహిళ పాత్ర ఎంతో కీలకం
మహిళ అంటే భార్యగా, తల్లిగా సక్సెస్ అయితేనే సరిపోదు. నేటి రోజుల్లో మహిళ పాత్ర కీలకంగా మారింది. మహిళ బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. ఆడపిల్ల అనే చిన్నచూపు చూసే రోజులు పోయాయి. దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి గల మహిళలు ఎంతో మంది ఉన్నారు. –డాక్టర్ కంచిపాటి శిరీష
Comments
Please login to add a commentAdd a comment