
హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి జిల్లా కోర్టు సమస్యలు
విశాఖ–లీగల్ : విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో పలు సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర హైకో ర్టు తమ వంతు చేయూతనిస్తుందని విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పది నెలలుగా మూతపడ్డ విశాఖ న్యాయవాద సంఘం క్యాంటీన్ తిరిగి ప్రారంభించడానికి హైకోర్టు న్యాయమూర్తి సుముఖంగా ఉన్నారని తెలిపారు. అలాగే న్యాయవాదుల సంఘం ప్రాంగణంలో ఏసీలను అమర్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. న్యాయవాదులు సమర్పించిన వినతి పత్రాలపై ప్రివిలేజ్ కమిటీలో పెడతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గత నెల 23న న్యాయవాద సంఘాలు తీర్మానం చేసిన హైకోర్టు బెంచ్ క్యాట్ ట్రిబ్యునల్ వంటివి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఘంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వారిలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి దంతి నరేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment