ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
ఆరిలోవ: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రూరల్ తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించింది. ఆరిలోవ, మధురవాడ, ఎండాడ, రుషికొండ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఇళ్లులేని పేదలు తహసీల్దారు కార్యాలయం సమీపానికి చేరుకొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా నాయకులు, పేదలతో కలిసి జాతీయరహదారిపై విశాఖ వ్యాలీ స్కూల్ కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ఎర్ర జెండాలు పట్టుకొని ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పేదలు నుంచి ఇళ్ల స్థలాలు కోసం దరఖాస్తులు సేకరించి తహసీల్దారు పాల్‌కిరణ్‌కు అందజేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి తర్వాత అమలు చేయలేదన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment