సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే
సాక్షి, విశాఖపట్నం : మహిళల సమానత్వం కోసం, వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుడివాడ అమర్‌నాథ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment