కమిషనర్‌ను నియమించకపోవడం కూటమి వైఫల్యమే..
డాబాగార్డెన్స్ : రాష్ట్రంలోనే విశాఖ కీలక నగరం..జీవీఎంసీ ఆయువుపట్టు..అలాంటి సంస్థకు కమిషనర్‌ను నియమించకపోవడం దారుణమని సీపీఎం, సీపీఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లు డాక్టర్ బి గంగారావు, ఏజే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తరువాత జీవీఎంసీ కమిషనర్‌గా సంపత్‌కుమార్‌ను నియమించారు. ఐదు నెలలు తిరగకముందే ఆఘమేఘాలపై ఆయనను చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదన్నారు. తక్షణం జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలని డిమాండ్ చేస్తూ సంస్థ ప్రధాన కార్యాలయ ద్వారం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు మాట్లాడుతూ ఐదు నెలల కాలంలోనే డాక్టర్ సంపత్‌కుమార్ కమిషనర్‌గా సమర్థవంతంగా పని చేశారన్నారు. అటువంటి కమిషనర్‌ను ఐదు నెలలు తిరగకముందు కూటమి నేతల స్వార్థం కోసం ఆయనను అమరావతికి బదిలీ చేశారని ఆరోపించారు. కమిషనర్ బదిలీఅయి రెండు నెలలు కావస్తున్నా..జీవీఎంసీకి కమిషనర్‌ను నియమించాలని ఆలోచన చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని కమిషనర్‌గా నియమించేందుకు మీలో గలాటా జరుగుతుందని తెలిసింది. ఇది సరైనది కాదన్నారు. సీపీఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ మాట్లాడుతూ కమిషనర్‌ను నియమించకపోవడం దారుణమన్నారు.
కూటమికి అనుకూల వ్యక్తి కోసమే ఆలస్యం
సీపీఎం, సీపీఐ నేతల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment