
కలెక్టరేట్‌లో ఘనంగా మొల్లమాంబ జయంతి
మహారాణిపేట: కవయిత్రి, మొల్ల రామాయణం రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్‌లో జరిగాయి. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు. మొల్ల రచనా శైలి సరళమైనదని, ఆమె జీవితం అనుసరణీయమైనదని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి బి.శ్రీదేవి, కుమ్మరి శాలివాహన సంఘం డైరెక్టర్ చిరంజీవులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.