
వైభవంగా గౌర పూర్ణిమ ఉత్సవాలు
కొమ్మాది : బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ ఇస్కాన్ టెంపుల్‌లో శుక్రవారం గౌర పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ కృష్ణభగవానుని భక్త అవతారమైన శ్రీ చైతన్య మహా ప్రభు ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యాయి. శ్రీ కృష్ణుని భజన సంకీర్తనలు, పుష్పాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చైతన్య లీలల్లో ఒకటైన చాంద్‌కాజీ ఉద్ధరణ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని, వంశీకృష్ణ ప్రభు, భక్తులు పాల్గొన్నారు.