
ఇసుకకొండకు పౌర్ణమి తాకిడి
డాబాగార్డెన్స్: ఇసుకకొండ(బాబాజికొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు చేశారు. వేకువజాము 3 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుదీరారు. నగరం నుంచే గాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ ఈవో రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్వామికి పూజలు చేస్తున్న అర్చకుడు