
హెచ్‌ఎస్‌ఎల్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా కిరణ్
సింథియా: హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ నూతన డైరెక్టర్‌గా కిరణ్ సణికరాలా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1997లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా అర్హత సాధించిన ఆయన 1998లో ఆర్‌ఐఎన్‌ఎల్‌లో చేరి కార్పొరేట్ ఖాతాలు, ట్రెజరీ, ప్రాజెక్ట్ ఫైనాన్స్, బడ్జెట్, ఇంటర్నెల్ ఆడిట్ వంటి రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించారు. ఆర్‌ఐఎన్‌ఎల్ ఐవోపీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ అవార్డును కూడా గెలుచుకున్నారు. హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఫైనాన్స్ అండ్ కమర్షియల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు.