
‘సాక్షి’తో వినియోగదారుల హక్కుల మండలి..
వినియోగదారుడు మోసపోకుండా ప్రతి దుకాణం కన్జ్యూమర్ రైట్స్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలంటూ జాతీయ వినియోగదారుల హక్కుల మండలితో కలిసి ‘సాక్షి’ బృందం.. ప్రజల్లోనూ, వ్యాపారుల్లోనూ చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు డా.వికాస్‌పాండే, జాతీయ అధికారప్రతినిధి బాలకృష్ణతో కూడిన బృందంతో కలిసి పలు దుకాణాలకు, సూపర్ మార్కెట్‌లకు వెళ్లి.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విక్రయాలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్, తూనికలు సరిచేసుకోవాలని సూచించారు.