
గాజువాకలో దారుణం
● పదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం ● కామాంధుడిని పట్టుకున్న స్థానికులు
అక్కిరెడ్డిపాలెం: పదేళ్ల బాలికపై 45 ఏళ్ల కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై.. నిందితుడిని పట్టుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ఎ.పార్థసారధి తెలిపారు. సీఐ తెలిపిన వివరాలివి.. గాజువాక డ్రైవర్స్ కాలనీలో కూరగాయలు అమ్ముకుంటూ దాడి భాను ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని ఎదురింట్లో పదేళ్ల బాలికతో కలిసి ఒక కుటుంబం నివాసం ఉంటోంది. శనివారం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి భాను ప్రవేశించాడు. బాలికను సుత్తి కావాలని అడిగి ఆమైపె లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాలిక పెద్దగా కేకలు వేయడంతో.. స్థానికులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇది గమనించి పారిపోతున్న భానును పట్టుకుని గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని భానును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.