శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తున్న
దృశ్యం
రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం(టీటీడీ)లో మంగళవారం ఆలయ శుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 20న నిర్వహించనున్న శ్రీవారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా టీటీడీ సంప్రదాయం ప్రకారం ముందుగా వచ్చే మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుగంధ ద్రవ్యాలతో శ్రీవారి ఆలయం, హనుమాన్, మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలను శుద్ధి చేశారు. మధ్యాహ్నం నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఏఈవో జగన్మోహనాచార్యులు, ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఆలయ అర్చకులు, పండితులు పాల్గొన్నారు.