పూర్తయిన నామినేషన్ల పర్వం
వివిధ పదవులకు 40 మంది పోటీ
విశాఖ లీగల్ : విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. బుధవారం సాయంత్రం తుది జాబితా వివరాలను ఎన్నికల అధికారి జి.ఎం.రెడ్డి, ఉప ఎన్నికల అధికారి సి.బి.ఎస్.లింగరాజు విలేకరులకు తెలిపారు. అధ్యక్ష స్థానానికి న్యాయవాదులు ఎం.కె.శ్రీనివాస్, ఐ.ఎం.అహ్మద్, నమ్మి సన్యాసిరావులు పోటీలో ఉన్నారు. కీలకమైన కార్యదర్శి పదవికి ఎల్పీ నాయుడు, ఆర్.సూర్యనారాయణ, ఏవి సోమేశ్వరరావు, వి.వెంకట సుధాకర్ రావు పోటీ చేస్తున్నారు. మొత్తం 5000 మందికి పైగా న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 28 తేదీ ఉదయం ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు రాత్రి 9 గంటలకు ఫలితాలు ప్రకటిస్తారు.