కుట్ర | - | Sakshi
Sakshi News home page

కుట్ర

Published Fri, Mar 21 2025 1:05 AM | Last Updated on Fri, Mar 21 2025 1:01 AM

కుట్ర

కుట్ర

వైఎస్సార్‌ పేరు తొలగింపులో

క్రికెట్‌ స్టేడియం వద్ద వైఎస్సార్‌ సీపీ ధర్నా

ఏసీఏ 48 గంటల్లో సమాధానం

చెప్పాలని డిమాండ్‌

ఏసీసీలో తిష్ట వేసిన

టీడీపీ ఎంపీల ఒత్తిడితోనే..

వైఎస్సార్‌ పేరును ఏసీఏ తొలగించిందా? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా? 48 గంటల్లో సమాధానం చెప్పాలని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ను డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఏసీఏలో రెండు కీలక పదవుల్లో టీడీపీకి చెందిన ఎంపీలు ఉన్నందునే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారనేది స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ పదవుల్లో ఉన్నవారు క్రికెట్‌ అసోసియేషన్‌లకు బాధ్యత వహించకూడదనేది ఉందని, దానిని కూడా ఉల్లంఘించి టీడీపీ ఎంపీలు ఏసీఏలో తిష్టవేశారన్నారు.

గుర్తులు చెరిపేయాలనే..

కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ పేరును చూస్తేనే ఉలిక్కిపడుతోందని అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. వైఎస్‌ రాజశేరరెడ్డి విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారన్నారు. ఆయన కృషిని గుర్తించి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఈ ప్రాంతంలో స్టేడియంకు వైఎస్సార్‌ పేరు పెడితే ఇప్పుడు దానిని కూడా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారన్నారు.

సాక్షి, విశాఖపట్నం : పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంకు ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్‌ ఆర్చ్‌పై వైఎస్సార్‌ పేరు తొలగింపునకు నిరసిస్తూ గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తొలుత మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లతో కలిసి ఆయన స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల రిబ్బన్లతో ఆందోళన చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ ఆనవాళ్లను తుడిచేయాలని సీఎం చంద్రబాబు అనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. 2009 సెప్టెంబర్‌ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగారాజు ఆధ్వర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా మార్చినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌ మార్క్‌, బ్రాండ్‌ కనబడకూడదనే కుట్రతోనే పేరును తొలగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సీతకొండ వ్యూ పాయింట్‌కు వైఎస్సార్‌ పేరు పెడితే దాన్ని తొలగించారని మండిపడ్డారు. విశాఖ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌ లాన్‌కు వైఎస్సార్‌ పేరు తొలగించారని, ఇవే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్సార్‌ విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు.

ముఖ్య నాయకులకు బెదిరింపు

అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వద్ద వైఎస్సార్‌ సీపీ ఆందోళన చేయనున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, చింతలపూడి వెంకటరామయ్య, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కె.భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్‌ దేవన్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కటుమూరి సతీష్‌, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ ముఖ్య నాయకులు రొంగలి జగన్నాఽథం, కొండా రాజీవ్‌గాంధీ, మొల్లి అప్పారావు, వుడా రవి, జహీర్‌ అహ్మద్‌, గండి రవి, శోభాస్వాతి రాణి, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, అక్కరమాని పద్మరాము నాయుడు, డౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకోడ వెంకట రత్న స్వాతి దాస్‌, పద్మా రెడ్డి, బిపిన్‌ కుమార్‌ జైన్‌, కె.వి.శశికళ, గుడివాడ అనూష, ఇమ్రాన్‌, జిల్లా కార్యవర్గం కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని బంగారు నాయుడు, నడింపల్లి కృష్ణంరాజు, చెన్నా జానకీరామ్‌, మువ్వల సురేష్‌, ద్రోణంరాజు శ్రీవాస్తవ్‌, బింగి హరి కిరణ్‌ రెడ్డి, పల్లా దుర్గారావు, మనలత జాబ్దాస్‌ (చిన్ని), పేడాడ రమణి కుమారి, వంకాయల మారుతీ ప్రసాద్‌, పీలా కిరణ్‌ జగదీష్‌, రామారెడ్డి, రాయపు అనిల్‌ కుమార్‌, లావణ్య చిమట, శెట్టి రోహిణి, పిల్లి సుజాత, పిల్లా సుజాత, అల్లంపల్లి రాజబాబు, మాధవీవర్మ, మజ్జి వెంకట రావు, బంకు సత్య, పోలిరెడ్డి, శ్రీదేవి వర్మ, రాజేశ్వరి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement