
ముస్లింలపై కూటమి కక్ష సాధింపు
● హజ్ యాత్రీకులకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేయడం తగదు ● వైఎస్సార్ సీపీ నేతలు మహమ్మద్ ఇమ్రాన్, భర్కత్ అలీ, జహీర్ అహ్మద్
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలపై కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడు భర్కత్ అలీ, సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ మండిపడ్డారు. హజ్ యాత్రీకుల సౌలభ్యం కోసం విజయవాడలో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎంబార్కేషన్ పాయింట్లు రద్దు చేసిందని, ఇది రంజాన్ మాసంలో రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘వెన్ను పోటు’ తోఫా అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ముస్లిల పక్షపాతి వైఎస్ జగన్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏపీ నుంచి బయలుదేరే యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లేలా ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతంలో హజ్ యాత్రలో భాగంగా 2,873 యాత్రీకులకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 14.04 కోట్లు నిధులు కేటాయించడమే కాకుండా వివిధ ఎంబార్కేషన్ పాయింట్లు నుంచి బయలుదేరిన వారికి కూడా ఆర్థిక చేయుతనిచ్చిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోగా కనీసం గన్నవరం విమాశ్రయం నుంచి వెళ్లే వీలు లేకుండా చేయడం దారుణమన్నారు. కో–ఆప్షన్ సభ్యుడు మహ్మద్ షరీఫ్, షేక్ బాబ్జి, ఆప్రోజ్ లతీష్, ముజీబ్ ఖాన్, ఎండీ నౌషాద్, ఎండీ ముక్బాల్ పాల్గొన్నారు.