
అభివృద్ధి పనులకు స్థాయీ సంఘం ఆమోదం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయీ సంఘం సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, జీవీఎంసీ స్థాయీ సంఘం చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. 104 అంశాలు పొందుపరచగా, ఒక అంశాన్ని వాయిదా వేశారు. 2 అంశాలను సభ్యులు తిరస్కరించారు. మిగిలిన 101 అంశాలు ఆమోదం తెలిపారు. వీటిలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగానికి చెందిన పలు అభివృద్ధి పనులు ఉన్నాయని వాటిని చర్చించిన పిదప సభ్యులు ఆమోదం తెలిపారన్నారు. సమావేశంలో కార్యదర్శి బీవీ రమణ, వ్యయ పరిశీలకుడు సి.వాసుదేవరెడ్డి, జోనల్ కమిషనర్లు ప్రేమ ప్రసన్నవాణి, శివప్రసాద్, మల్లయ్యనాయుడు, బి.రాము, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు చిరంజీవి, గంగాధరరావు, సుధాకర్, అప్పారావు, సహాయ వైద్యాధికారులు డాక్టర్ ఎన్ కిషోర్, డాక్టర్ సునీల్‌కుమార్, డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ కృష్ణంరాజు పాల్గొన్నారు.