
‘పీజీఆర్‌ఎస్’ వినతులపై నిర్లక్ష్యం వద్దు
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో వచ్చిన వినతులపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఈనెల 18న సాక్షి దిన పత్రికలో ‘ప్రజా ప్రదక్షిణ’లే అన్న శీర్షికతో వార్త ప్రచురితమైన సంగతి విధితమే. దీనిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్పందించారు. సాక్షి కథనంలో తమ అభిప్రాయాలను వెల్లడించిన వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పరిష్కరించడంలో ఎవరు అలసత్వం ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సంబంధిత విభాగాలు, పలు శాఖల అధికారులు ఫిర్యాదుల పరిష్కారంపై తక్షణం నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.