
ఉపాధి హామీ పథకంపై సమీక్ష
మహారాణిపేట: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈ పథకం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. జిల్లాలో చేపడుతున్న చర్యలు వివరించారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కె.వి.వి.చౌదరి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీపీవో శ్రీనివాసరావు, డ్వామా అధికారులు పాల్గొన్నారు.
‘యువర్ ప్లాట్‌ఫాం’ మ్యాగజైన్ ప్రారంభం